Saturday, April 20, 2024

ఐపీఎల్ 2023 నుంచి వైదొలిగిన.. ప్యాట్ క‌మ్మిన్స్‌

కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు 2023 ఐపీఎల్ కు ముందు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. మంగ‌ళ‌వారం త‌న ట్విట్ట‌ర్‌లో అత‌ను ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఎక్కువ‌గా ఉన్నందు వ‌ల్ల .. ఐపీఎల్‌లో ఆడ‌డం వీలు కాద‌ని అత‌ను తెలిపాడు.

ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ త‌ర‌పున క‌మ్మిన్స్ ఆడుతున్న విష‌యం తెలిసిందే. రాబోయే 12 నెల‌ల షెడ్యూల్ బిజీగా ఉంద‌ని, ఇక యాషెస్ సిరీస్‌, వ‌ర‌ల్డ్‌క‌ప్ నేప‌థ్యంలో ఐపీఎల్ నుంచి రెస్ట్ తీసుకోనున్న‌ట్లు క‌మ్మిన్స్ వెల్ల‌డించారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో తుంటి గాయం కారణంగా మధ్యలోనే ప్యాట్ క‌మ్మిన్స్‌ తప్పుకున్నాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement