Wednesday, April 24, 2024

Humanity | కన్నీటితోనే ఆ తల్లిదండ్రుల గొప్ప నిర్ణయం.. మరో 10 మందికి పునర్జన్మ

బెంగళూరులో 14 ఏండ్ల బాలిక నాలుగో అంతస్తు నుంచి కిందపడి చనిపోయింది. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. తీవ్రమైన గాయాలు​ ​ కావడంతో డాక్టర్లు ఆమెను బతికించడానికి చాలా ట్రై చేశారు. నాలుగు రోజులపాటు చావుతో పోరాటం చేసింది ఆ అమ్మాయి. చివరికి వైద్యానికి సహకరించకుండా బ్రెయిన్​ డెడ్​తో చనిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే తమ కూతురికి కొత్త లైఫ్​ అందించేందుకు ముందుకొచ్చారు. అవయవదానంతో మరో 10 మందికి పునర్జన్మను ప్రసాదించారు..

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రావొద్దు. కానీ, ఆకస్మికంగా జరిగిన ఓ ఇన్సిడెంట్​తో ఆ యువతి బతికే చాన్స్​ లేకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం మరో 10 మందికి పునర్జన్మిచ్చింది. మే 28వ తేదీన మరణించిన 14 ఏళ్ల బాలిక కృతి జైన్ తల్లిదండ్రులు తమ కుమార్తె అవయవాలను దానం చేయడం ద్వారా 10 మంది రోగులకు ప్రాణదానం చేశారు. బెంగళూరులోని కాటన్‌పేట పేట్‌లో వీరేందర్‌ కుమార్‌ జైన్‌, మోనికా దంపతుల కుమార్తె కృతి తన ఇంటి నాలుగో అంతస్తు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయింది.

మే 24వ తేదీన కృతి తన కజిన్స్ తో ఆడుకుంటూ నాలుగో అంతస్తు నుండి పడిపోయింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి ICUలో చేర్చారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మే 28వ తేదీన కృతి చనిపోయింది. కృతి తలకు బలమైన గాయం కావడం వల్ల ట్రీట్​మెంట్​కు రెస్పాండ్​ కాలేదని డాక్టర్లు చెప్పారు. ఇక.. కృతి తల్లిదండ్రులు తమ కుమార్తె ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, గుండె కవాటాలు, కార్నియాలను దానం చేశారు. ఇట్లా మరో 10 మంది రోగులకు ప్రాణదానానికి ఎంతో సహాయపడింది. కృతి ఊపిరితిత్తులను చెన్నైలోని ఒక రోగికి అమర్చారు. ఇతర అవయవాలను బెంగళూరులోని రోగులకు అమర్చారు.

- Advertisement -

 ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న కొంతమందికి, వారికి అవసరమైన అవయవాలను దానం చేసి కొత్త జీవితాన్ని ఇచ్చినందుకు కృతి తల్లిదండ్రులకు ప్రైవేటు హాస్పిటల్ చీఫ్, ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్ సరళా అనంతరాజ్ ధన్యవాదాలు తెలిపారు. చనిపోయిన బాలిక బెంగళూరులోని బాల్డ్ విన్ గర్ల్స్ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. చదువులో ఎంతో ఉత్సాహంగా ఉండేదని ఆమె తండ్రి బిజినెస్​ మెన్​ వీరేందర్ కుమార్ గుర్తు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement