Saturday, April 20, 2024

రష్యా వార్​: ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన కూతురు కోసం తల్లిదండ్రుల కన్నీరు..

రష్యా ఉక్రెయిన్​పై చేస్తున్న యుద్ధంతో సామాన్యులు భయాందోళనకు గురవుతున్నారు. ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన తమ 20 ఏళ్ల కూతురు క్షేమంగా తిరిగి రావాలని భారతీయ తల్లిదండ్రులు కన్నీళ్లతో వేడుకుంటున్నారు. ఇట్లాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ఒక తల్లిగా నేను ఎలాంటి వేదన అనుభవిస్తున్నానో ఏమని చెప్పాలే.. నా బిడ్డ వయస్సు కేవలం 20 సంవత్సరాలు. నా ఆందోళన అంతా తాను ఎలా ఉందో అని.. ఇప్పటికే అక్కడ వేలాది మంది చనిపోయినట్టు వార్తలొస్తున్నాయి. ఒకవేళ నెట్​వర్క్​ షట్​ డౌన్​ అయితే.. నేను ఆమెతో ఎలా కాంటాక్ట్​ అవగలను.. అని ఓ తల్లి కన్నీటి పర్యంతమైంది. నాకుమార్తె ప్రస్తుతం బాగానే ఉన్నానని చెబుతోంది. కానీ, ఇప్పుడు ప్రతి చోటా భయాందోళనలు నెలకొన్నాయి. అందుకనే ఆందోళన చెందుతున్నా అని ఉక్రెయిన్​లోని విన్నిట్సియాలో చిక్కుకున్న 20ఏళ్ల యశ్వి తల్లి అర్పితా సేథియా అన్నారు.

 యశ్వి సేథియా విన్నిట్సియా మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం వైద్య విద్యార్థిగా ఉంది. మరో ముగ్గురు భారతీయ అమ్మాయిలతో కలిసి అద్దె అపార్ట్మెంట్లో ఉంటోంది. ఇద్దరు ఉక్రెయిన్ నుండి భారతదేశానికి బయలుదేరగా, కోల్‌కతాకు చెందిన యశ్వి, ఆమె స్నేహితుడు ఇప్పటికీ అక్కడే ఉండిపోయారు. యశ్వి చివరిసారిగా గత ఏడాది జూన్‌లో తన 2 నెలల సెలవుపై ముంబైకి వచ్చారు. ‘‘పరిస్థితి మరింత దిగజారుతుందని మాకు తెలుసు. కానీ, ఆమె వైద్య కళాశాల మూడవ సంవత్సరం, ఆరవ సంవత్సరం విద్యార్థులను విడిచిపెట్టడానికి అనుమతించలేదు. మేలో చదువు పూర్తి చేసిన మూడో సంవత్సరం విద్యార్థులు జూన్‌లో ‘క్రోక్‌’ పరీక్ష రాయాల్సి ఉంటుంది. విద్యార్థులు ఈ పరీక్షను మిస్ చేసుకోలేరు, లేకుంటే వారు రెండేళ్లు పునరావృతం చేయవలసి ఉంటుంది”అని అర్పితా సేథియా అన్నారు.

కానీ, మూడు రోజుల క్రితమే వారు విద్యార్థులను పంపించమని అడిగారు. అందువల్ల అకస్మాత్తుగా ఉపద్రవం వచ్చిపడుతుందని ఎవరూ ఊహించలేదు’’  అని ఆమె తెలిపారు. రెట్టింపు ధరకు విమాన టిక్కెట్‌ను పొందగలిగిన యశ్వి, కీవ్‌కి చేరుకోవాల్సి ఉంది. అయితే ఎయిర్‌స్పేస్ అకస్మాత్తుగా మూసివేయబడటంతో ఆమె అక్కడే చిక్కుకుపోయింది. కనీసం 30 శాతం మంది విద్యార్థులు ఇప్పటికీ చిక్కుకుపోయారని, తిరిగి రావడానికి వారు ఎదురుచూస్తున్నట్టు యశ్వి తండ్రి సుభాష్ సేథియా చెప్పారు.

‘‘ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన సరుకులు నిల్వ చేసుకోవాలని కోరింది. కానీ, ఆమె బస చేసిన ప్రదేశంలో ప్రజలంతా వీధుల్లోకి వచ్చారు. ఏమి జరుగుతుందోననే భయాందోళనలతో వారు ఎట్లాంటి సరుకులు కొనుగోలు చేయలేదు. అందుకే ఫుడ్​కి కూడా వారికి ఇబ్బందిగానే ఉండనుంది.’’ ఆమె చెప్పింది. రాబోయే రోజుల గురించి ఆలోచిస్తూ తల్లిదండ్రులు కంట తడి పెట్టారు. తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేక, కేవలం ప్రార్థిస్తున్నానని, భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం మరింత వేగంగా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement