Tuesday, March 26, 2024

Omicron ఎఫెక్ట్: ప్రపంచవ్యాప్తంగా 4,500 విమానసర్వీసుల రద్దు

ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిచెందుతున్న ఒమైక్రాన్ వేరియెంట్ ప్రభావం విమాన సర్వీసులపై పడింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒమైక్రాన్ కేసులతో 4,500 విమాన సర్వీసులను రద్దు చేశారు.ఒమైక్రాన్ వేరియెంట్ క్రిస్మస్ ఆనందాన్ని తగ్గించింది. ఒమైక్రాన్ వల్ల క్రిస్మస్ ఆనందాన్ని తగ్గించడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వేలాది విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. కమర్షియల్ ఎయిర్‌లైన్ క్యారియర్లు క్రిస్మస్ వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా 4,500 విమాన సర్వీసులను రద్దు చేశాయి.

ఒమైక్రాన్ వేరియంట్ వ్యాప్తి కారణంగా పండుగ సంతోషాన్ని ప్రయాణ ప్రణాళికలను దెబ్బతీశాయి. ఫ్లైట్-ట్రాకింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లైట్ అవేర్ డాట్ కాం నుంచి వచ్చిన డేటా ప్రకారం, క్రిస్మస్ ఈవ్‌లో కనీసం 2,401 విమానాలు నిలిపివేశారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ రోజున 1,900 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఇందులో అమెరికా విమాన సర్వీసులు ఎక్కువగా రద్దు అయ్యాయి. భారతదేశంలో ఒమైక్రాన్ కేసులసంఖ్య 415కి పెరిగాయి. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్ శుక్రవారం 300 విమానాలను రద్దు చేశాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement