Thursday, April 25, 2024

ప్రపంచ రికార్డ్: దేశంలో 4 లక్షలు దాటిన కరోనా కేసులు!

దేశంలో కరోనా మహమ్మారి  కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో నాలుగు లక్షలపై చిలుకు కేసులు నమోదు అయ్యాయి. ఒక్కరోజే 4,01,993 మంది వైరస్​ బారినపడ్డారు. కొవిడ్​ కారణంగా మరో 3,523 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ సోకిన వారిలో 2,99,988 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,91,64,969కు చేరింది. ఇందులో 1,56,84,406 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. 2,11,853 మంది మరణించారు. ప్రస్తుతం 32,68,710 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొత్తగా 2,99,988 మంది డిశ్చార్జ్ అయ్యారు.

దేశవ్యాప్త రికవరీ రేటు 81.84 శాతానికి పడిపోగా.. మరణాల రేటు 1.11 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం 19.45 లక్షల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్​ల సంఖ్య 28 కోట్ల 83 లక్షలు దాటింది. కరోనా కట్టడిలో భాగంగా.. ఇప్పటివరకు మొత్తం 15.49 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement