Friday, April 19, 2024

ఈ ఏడేళ్ల జర్నీ గురించి మా పాప ఎన్నో నేర్చుకుంటుంది.. కోహ్లీ రిటైర్​ పై అనుష్క హ్యాపీ పోస్టు..

భారత టెస్ట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ వైదొలిగిన తర్వాత.. బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన భర్త గురించి ఒక ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టారు. తన నోట్‌లో.. విరాట్ కోహ్లీ క్రికెట్ జర్నీ గురించి, తాము ఎలా ప్రేమలో పడ్డారనే విషయాలను రాసుకొచ్చింది. ఆమె రాసిన ఈ నోట్ పై తన సంతకం కూడా చేసింది. “మా పాప.. ఏడేళ్లలో తన తన తండ్రి చేసిన ఎన్నో విజయాల నుంచి ఎంతో నేర్చుకుంటుంది. మీరు రిటైర్మెంట్ తీసుకుని మంచి పని చేశారు” అని ఆ పోస్టులో పేర్కొంది. అనుష్క శర్మ, విరాట్ కోహ్లిల ప్రేమకథ.. వారు కలిసి చేసిన షాంపూ కమర్షియల్ యాడ్ సెట్స్ లో ప్రారంభమైందని రాసుకొచ్చింది ఈ బ్యూటీ. చాలా సంవత్సరాల పాటు డేటింగ్ తర్వాత ఈ జంట 2017లో టుస్కానీలో ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలకు గత ఏడాది జనవరిలో పాప వామిక జన్మించింది.

అనుష్క తన నోట్‌లో విరాట్ కోహ్లీని కొత్త టెస్ట్ కెప్టెన్‌గా ప్రకటించిన సమయాన్ని గుర్తుచేసుకుంది. “టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ కావాలని ఎంఎస్ నిర్ణయించుకున్నందున మిమ్మల్ని కెప్టెన్‌గా నియమించినట్లు 2014లో మీరు నాకు చెప్పిన రోజు ఇంకా నాకు గుర్తుంది” అని ఆమె పోస్టులో పేర్కొంది. ఇంకా “2014లో మేము చాలా అమాయకంగా ఉన్నాము. కేవలం మంచి ఉద్దేశాలు, సానుకూల దృక్పథం వంటివి జీవితంలో ముందుకు తీసుకెళ్లగలవని ఆలోచించాం. కానీ, సవాళ్లు లేకుండా ఏదీ జరగదు. విరాట్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఎప్పుడూ ఫీల్డ్‌ లో ఉండేవారు. నేను మీ గురించి చాలా గర్వపడుతున్నాను.” అంటూ అనుష్క తన పోస్టులో ఎన్నో కొత్త విషయాలు చెప్పుకొచ్చింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement