Thursday, April 25, 2024

Bad Luck: గుజారాతీ మూవీకి ఆస్కార్ ఎంట్రీ.. ఆర్​ఆర్​ఆర్​కు దక్కని చాన్స్​!​

క్రేజీ మల్టీస్టారర్, పాన్​ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బాక్సీఫీసు వద్ద భారీ వసూళ్లు సాధించింది. అంతేకాదు ఓ తెలుగు డైరెక్టర్​ తీసిన మూవీ బాలివుడ్​లో సంచలనాలు రేపడంతో అంతా దీని గురించే చర్చించుకున్నారు. ఈ మూవీకి కచ్చితంగా ఆస్కార్ పురస్కారం దక్కుతుందని అనుకున్నారు. కానీ,​ ఆస్కార్‌లోనూ నిలుస్తుందనుకున్న వారి ఆశలపై గుజరాతీలు దెబ్బకొట్టారు. ఈ విషయంలో ఆర్​ఆర్​ఆర్​కు నిరాశ ఎదురైంది.

తాజాగా ప్రకటించిన భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’ ఎంపికైంది. ఈ మేరకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 95వ ఆస్కార్ అవార్డుల పోటీలకు ఛెల్లో షోను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రెటరీ జనరల్ సుప్రాన్ సేన్ వెల్లడించారు. ఇంగ్లిష్​లో ‘లాస్ట్ ఫిల్మ్ షో’గా పిలుస్తున్న ఈ చిత్రానికి పాన్ నలిన్ దర్శకత్వం వహించాడు. 2021 అక్టోబర్ 14వ తేదీన దేశవ్యాప్తంగా విడుదలైంది. రాయ్ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్​పై సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించారు. జుగాడ్ మోషన్ పిక్చర్స్, మాన్​సూన్ ఫిల్మ్స్, ఛెల్లో షో ఎల్ఎల్​పీ, మార్క్ దువాలే సైతం నిర్మాణంలో భాగమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement