Saturday, June 12, 2021

ఆరెంజ్ అలర్ట్: ముంబైలో భారీ వర్షాలు

దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ముంబైలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. గత రెంజు రోజులుగా కురిసిన వర్షాలతో ముంబై జలమయమైంది. రాబోయే నాలుగురోజుల పాటు ముంబైలో భారీవర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముంబై నగరంతోపాటు శివారు ప్రాంతాలు, థానే, పాల్ఘార్, రాయ్ గడ్ జిల్లాల్లో వచ్చే భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఐఎండీ ‘ఆరంజ్ అలర్ట్’ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. పాల్ఘార్‌లో వంతెన సైతం కూలింది. భారీవర్షాలతో పలు ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. దీంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కరోనాతో అల్లాడిన ముంబై వాసులకు భారీ వర్షాలు వణికిస్తున్నాయి.  

ఇదీ చదవండి: ఎన్నికల వేళ కాంగ్రెస్ కు షాక్… బీజేపీలోకి రాహుల్ సన్నిహితుడు

Advertisement

తాజా వార్తలు

Prabha News