Thursday, April 18, 2024

వన్ ప్లస్ 9 ఆర్ టీ.. తక్కువ ధరలో ప్రీమియం ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ ఇటీవలే వన్ ప్లస్ 9 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. తక్కువ ధరలో వన్ ప్లస్ 9ఆర్ సేల్ ఫోన్లను సేల్ చేస్తోంది. అమెజాన్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు కూడా ఉన్నాయి.

శనివారమే వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. ఇందులో మూడు వేరియంట్లు ఉన్నాయి. ప్రారంభ వేరియంట్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ.40,900, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.44,400 ఉంది.

వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఒప్పో కలర్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇందులో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ శాంసంగ్ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ ఉంటుంది. దీని టచ్ శాంప్లింగ్ రేట్ 1300 హెర్ట్జ్ ఉండటం విశేషం. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.


వన్ ప్లస్ 9ఆర్ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11ను ఇందులో వన్ ప్లస్ అందించింది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనో క్రోమ్ సెన్సార్ ఉన్నాయి. ఇక ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

4500 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని ఇందులో అందించారు. వార్ప్ 65టీ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. వైఫై 6, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

- Advertisement -

వన్ ప్లస్ 9ఆర్ ధర
రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా ఉంది. ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.43,999గా నిర్ణయించారు. వన్ ప్లస్ 9ఆర్‌‌ను కార్బన్ బ్లాక్, లేక్ బ్లూ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement