Thursday, April 25, 2024

బీజేపీలోకి మరో సీనియర్ నేత ?: బండి హింట్

తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ త్వరలో బీజేపీలో చేరనున్నారు. అయితే, ఈటలతోపాటు మరో పెద్ద నాయకుడు కూడా బీజేపీలోకి వస్తారని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. హుజురాబాద్ నియోజకవర్గం పార్టీ నేతలు, కార్యకర్తలకు వర్చువల్ గా సమావేశం నిర్వహించిన బండి సంజయ్.. తమ పార్టీలోకి పెద్ద నాయకుడు రాబోతున్నారని, ఈటలకు మద్దతుగా ఉండాలని సూచించారు. అయితే ఆ నాయకుడు ఎవరనేదానిపై స్పష్టత ఇవ్వలేదు.

దీంతో బీజేపీలోకి వెళ్లబోయే పెద్ద నాయకుడు ఎవరనే సస్పెన్స్ నాయకుల్లో నెలకొంది. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉమ్మడిగా ఐక్య వేదిక ఏర్పాటు చేయాలని కొండా భావించారు. అయితే, ఈటల బీజేపీలోకి వెళ్తుండడంతో అది సాధ్యం కావడం లేదు. దీంతో కొండా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారు. మాజీ మంత్రి డీకే అరుణతోనూ భేటీ అయ్యారు. బండి చెప్పింది మాజీ ఎంపీ కొండా గురించా? లేక టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడా ? లేకా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తాడా? అన్నది ఉత్కంఠగా మారింది. అటు టీఆర్ఎస్ నేతల్లో కూడా బండి వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్‌లో అసంతృప్తులను మచ్చిక చేసుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. తమ పార్టీల నుంచి ఎవరు వెళ్లిపోతారనే టెన్షన్ కాంగ్రెస్ పార్టీలోనూ ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement