Wednesday, April 24, 2024

Spl Story: ఒకే ఒక్క క్లిక్​, ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలు.. రేపు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం!

కంటెంట్ ఎంత బాగా ఉన్నా.. దానికి తగ్గ కటౌట్ లేకపోతే ఆ స్టోరీ వేస్టే.. అంత గొప్పదనం తెలిపే కటౌట్ ను కేవలం ఒక్క క్లిక్ తో క్రియేట్ చేయొచ్చు. కేవలం ఒక్క ఫొటోతో ఎన్నో భావాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసే అద్భుతమైన శక్తి ఒక్క ఫొటోగ్రఫీకే ఉంది. మానవ జీవితానికి ఈ ఫొటోగ్రఫీకి అవినాభవ సంబంధం ఉంది. కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో విషయాలను, స్వీట్ మెమోరీస్ కు ఫొటోలే నిదర్శనంగా నిలుస్తాయి. బ్లాక్ అండ్ వైట్ తో ప్రారంభమైన ఫొటోగ్రఫీ కాలానికి తగ్గట్టు కలర్ ఫుల్ గా మారింది. దీంతో ఫొటోగ్రఫీ రోజురోజుకు ఎన్నెన్నో ప్రత్యేకతలను పరిచయం చేస్తూ కొత్త పుంతలు తొక్కుతోంది. నేడు (ఆగస్టు 19) ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా చిత్రవిచిత్రాల విశేషాలను తెలుసుకుందాం..

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

పలు రసాయనాలతో రూపొందించిన ప్లేటుపై కాంతి చర్యతో ఓ రూపాన్ని బంధించడాన్ని ఫొటోగ్రఫీ అంటారు. రెండు గ్రీకు పదాల కలయికే ఫొటోగ్రఫీ. ఫొటో అంటే చిత్రం. గ్రఫీ అంటే గీయడం అని అర్థం.. ఫైనల్ గా ఫొటోగ్రఫీ అంటే కాంతింతో చిత్రాన్ని గీయడం అన్నమాట. ఈ ఫొటోగ్రఫీకి శతాబ్దాల చరిత్ర ఉంది. 18వ శతాబ్దంలో ప్యారిస్ లో బ్లాక్ అండ్ వైట్ కలర్లతో ఫొటోగ్రఫీ ప్రారంభమైంది.

దీని ప్రాసెస్ కనుగొన్నదెవరో తెలుసా..

 ఫ్రాన్స్ కు చెందిన లూయిస్ జె.ఎం.డాగ్యూరే అనే వ్యక్తి 1837లో ఫొటోగ్రఫీ ప్రాసెస్ ను కనుగొన్నారు. 1839 జనవరి 9న ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ డాగ్యురే టైప్ ఈ ఫొటోగ్రఫీ ప్రాసెస్ ను అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది నెలలకు 1839 ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం ఫొటోగ్రఫీపై పేటెంట్ హక్కులను కొనుగోలు చేసి దాన్ని ప్రపంచానికి బహుమతిగా అందించింది. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

- Advertisement -

మన దగ్గర ఫొటోగ్రఫీ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైందంటే..

ఫ్రాన్స్ దేశంలో 1839లో అధికారికంగా ఫొటోగ్రఫీని ప్రపంచానికి ఉచితంగా అందించినా.. భారతదేశానికి 1857 వరకు ఫొటోగ్రఫీ అందుబాటులోకి రాలేదు. అప్పుడు కూడా బ్రిటీష్ రాజు, జమీందారులు, సిపాయిలు మాత్రమే దీన్ని వినియోగించేవారు. 1977 నుంచి దేశంలోని సామాన్యులకు ఫొటోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది. మన దేశంలో తొలిసారిగా లాలా దీన దయాళ్ ఫొటోగ్రఫీకి శ్రీకారం చుట్టారు.

ఇప్పుడైతే సెల్​ఫోన్లు, సెల్ఫీల హల్ చల్..

బ్లాక్ అండ్ వైట్ తో మొదలైన ఫొటోల ప్రస్థానం ప్రస్తుతం సెల్​ఫోన్లు, సెల్ఫీలతో తెగ హల్ చల్ చేస్తోంది. ప్రపంచంలో సుమారు 80 శాతం మంది ప్రజలు సెల్ఫీలపై తెగ మోజు చూపుతున్నారు. ఇక మన దేశంలో సెల్ఫీల కోసం ఏవేవో ఫీట్లు చేస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది సెల్ఫీలను తీసుకుని ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో పెట్టి అందరి చేత మన్ననలు పొందుతున్నారు. మరి కొందరైతే సెల్ఫీలను తీసుకుని ప్రతి ఫొటోని షేర్ చేస్తున్నారు. ఇంకొందరికైతే సెల్ఫీల పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్లిపోయింది. సో ఫొటోలకు ఇప్పటికీ ఎంత డిమాండ్ ఉందో ఇప్పటికే చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. మీరు కూడా ఈరోజు ఒక ఫొటో తీసుకుని హ్యాపీ ఫొటోగ్రఫీ డే విషెస్ ను షేర్ చేసుకోండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement