Thursday, April 25, 2024

Jyada Hogaya: ఢిల్లీ మెట్రో ట్రాక్​పై మూత్ర విసర్జన.. దారుణాన్ని చూసి ట్విట్టర్​లో తిట్టిపోస్తున్న జనం!

ఢిల్లీ మెట్రో స్టేషన్​లోని పట్టాలపై ఓ వ్యక్తి యూరిన్​ (మూత్ర విసర్జన) చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. అయితే.. ఆ వీడియోలో యూరిన్​ చేస్తున్న వ్యక్తి.. బాగా తాగి స్టేషన్​లోకి వచ్చినట్టు స్పష్టవుతోంది. చాలామంది ఈ వీడియో చూసి ఢిల్లీ మెట్రో రైల్​ సంస్థని ఛీ కొడుతున్నారు. ఇంత దారుణంగా నిర్వహణ ఉండడంపై అసహ్యించుకుంటున్నారు. కాగా, ఈ వీడియోని అక్టోబర్​ 29న బబ్బర్​ అనే వ్యక్తి తన ట్విట్టర్​లో పోస్టు చేస్తూ.. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC), ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఢిల్లీని ట్యాగ్ చేశాడు. దీంతో అధికారులు తదుపరి విచారణ కోసం స్టేషన్ పేరు ఏంటని ​ అడిగారు.. దీంతో అతను స్పందిస్తూ అది “మాల్వియా నగర్ మెట్రో స్టేషన్” అని సూచించాడు.

ఇక.. వీడియో రికార్డింగ్ చేస్తున్న వ్యక్తి  ‘‘ఇక్కడ మూత్ర విసర్జన ఎందుకు చేస్తున్నారు?’’ అని అడగడం వినిపించింది. దీనికి, మత్తులో కనిపించిన వ్యక్తి, “హో గయా, జ్యాదా హో గయా (నేను కొంచెం ఎక్కువగా తాగాను)” అని బదులిచ్చాడు. అయితే.. ఈ సంఘటనను వీడియో తీసి ట్విట్టర్​లో పోస్టు చేసిన వ్యక్తికి ఢిల్లీ మెట్రో రైల్​ కార్పొరేషన్​ ధన్యవాదాలు తెలిపింది. ఇట్లాంటివి మేదైనా ఇన్సిడెంట్స్​ కనిపిస్తే 24 గంటల భద్రతా హెల్ప్ లైన్‌కు కాల్ చేయాలని సూచించింది. తమ 24×7 హెల్ప్ లైన్ నంబర్ 155370 , సెక్యూరిటీ హెల్ప్ లైన్ నంబర్. 155655ను సంప్రదించవచ్చని, దీంతో తక్షణ చర్యలు తీసుకుంటామని DMRC తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement