Saturday, April 20, 2024

Omicron : 57 దేశాలకు పాకిన ఒమిక్రాన్.. కేసుల సంఖ్య ఎంతంటే!

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ కల్లోలం సృష్టిస్తోంది. ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలకు కలవరపరుస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ ఒమిక్రాన్.. ఇప్పుడు 57 దేశాలకు విస్తరించింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 2,172 మందికి ఒమిక్రాన్ సోకింది. భారత్ లో 23, డెన్మార్క్ లో 577, యూకేలో 568, దక్షిణాఫ్రికాలో 360, అమెరికాలో 55, జింబాబ్వేలో 50 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

రాబోయే రోజుల్లో మరికొన్ని దేశాలకు కూడా ఒమిక్రాన్ విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ విస్తరిస్తున్న కొద్దీ ఆసుపత్రిలో చేరాల్సిన రోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement