Thursday, April 25, 2024

Omicron: ఒమిక్రాన్ పై కేంద్రం అలర్ట్.. రాష్ట్రాలకు లేఖ

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ ను కలవర పెడుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ సహా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒమక్రాన్ వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఒమిక్రాన్ పై తగు జాగ్రత్తలను సూచిస్తూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన రోగులను ప్రత్యేకంగా ఐసోలేషన్​లో ఉంచాలని సూచించింది. వార్డుల్లో ఇతర రోగులకు, సిబ్బందికి వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. విదేశాల నుంచి వచ్చి వైరస్​ పాజిటివ్​గా తేలినవారి నమూనాలను జీనోమ్​ సీక్వెన్స్ కోసం ల్యాబ్​లకు పంపించాలని తెలిపింది. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్​లను కూడా నిశితంగా పరిశీలించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్​ లేఖలో పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ వేరియంట్ ​ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాపిస్తోంది. భారత్​లో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో భారత్​లో కరోనా థర్డ్ వేవ్ భయాలు మొదలయ్యాయి. థర్డ్ వేవ్​ను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం కావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్​ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement