Sunday, April 14, 2024

Omicron: దేశంలో 961కి చేరిన ఒమిక్రాన్ బాధితులు.. రాష్ట్రాల వారీగా కేసులు ఇవీ..

దేశంలో ఒమిక్రాన్ విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 961కి చేరింది. ఇప్పటి వరకు ఒమిక్రాన్ నుంచి 320 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఈ ఒమిక్రాన్ వేరియంట్ దేశంలోని 22 రాష్ట్రాలకు వ్యాపించింది. అత్యధికంగా ఢిల్లీలో 263, మహారాష్ట్రలో 252 కేసులు నమోదు అయ్యాయి. ఇక, గుజరాత్ లో 97, రాజస్థాన్ లో 69, కేరళలో 65, తెలంగాణలో 62, తమిళనాడులో 45, కర్నాటకలో 34, ఆంధ్రప్రదేశ్ లో 16, హర్యానాలో 12, పశ్చిమ బెంగాల్ లో 11, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 9 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్ లో 4, ఛత్తీస్ గఢ్, జమ్మూకశ్మీర్ లో 3 కేసుల చొప్పున.. యూపీలో 2, గోవా, హిమాచల్ ప్రదేశ్ , లఢాఖ్, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఒక్కో కేసులు నమోదు అయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement