Wednesday, April 24, 2024

వెయ్యికి పైగా ఈ-స్కూట‌ర్లను రీకాల్ చేస్తున్న ఓలా ఎల‌క్ట్రిక్

ఎలక్ట్రిక్‌ వాహనాలుంటే కాలుష్యం త‌గ్గ‌తుంద‌ని ప్ర‌జ‌లు భావిస్తుంటే.. అనేక ప్రాంతాల్లో ఈ-బైక్‌ల పేలుళ్లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. దీంతో వాటి బ్యాటరీల నాణ్యత, ఇత‌ర కారణాలు ఈ ప్రమాదాలకు కారణాలని నిపుణులు చెబుతోన్న వేళ ఓలా ఎల‌క్ట్రిక్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పూణెలో ఇటీవ‌ల జ‌రిగిన ప్ర‌మాదాన్ని దృష్టిలో ఉంచుకుని 1,441 యూనిట్ల ఈ-బైక్‌ల‌ను రీకాల్ (వెన‌క్కి పిలిపించ‌డం) చేస్తున్న‌ట్లు తెలిపింది. ఇటీవ‌ల‌ ప్ర‌మాదానికి గురైన ఈ-స్కూట‌ర్ తో పాటు ఆ బ్యాచ్‌లో తయారైన అన్ని బైక్‌ల‌నూ ప‌రిశీలించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఓలా తెలిపింది. అందుకే ఆ బైక్‌ల‌ను వెన‌క్కి పిలిపిస్తున్న‌ట్లు వివ‌రించింది. ఆ స్కూట‌ర్ల‌లోని బ్యాట‌రీలు, థ‌ర్మ‌ల్ వ్య‌వ‌స్థ‌ల‌పై త‌మ స‌ర్వీస్ ఇంజ‌నీర్లు స‌మీక్ష నిర్వ‌హిస్తార‌ని చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement