Saturday, April 20, 2024

India | బీఆర్​ఎస్​లో చేరిన ఒడిశా మీజీ సీఎం గిరధర్​ గమాంగ్​.. మరో 12 మంది మాజీ ఎమ్మెల్యేలు

భార‌త్ రాష్ట్ర స‌మితికి దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఒడిశా మాజీ సీఎం గిరిధ‌ర్ గ‌మాంగ్ ఇవ్వాల బీఆర్ఎస్​లో చేరారు. తెలంగాణ భ‌వ‌న్‌లో గిరిధ‌ర్ గమాంగ్​కి సీఎం కేసీఆర్ పార్టీ కండువా క‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు మరో 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, న‌లుగురు మాజీ ఎంపీలు చేరారు. బీఆర్ఎస్‌లో చేరిన వారిలో హేమ గమాంగ్, జ‌య‌రాం పాంగీ, రామ‌చంద్ర హ‌న్ష్‌డా, బృందావ‌న్ మ‌జ్హీ, న‌బీన్ నంద‌, రాథా దాస్, భ‌గీర‌థి సేతి, మ‌య‌దార్ జేనా ఉన్నారు. గిరిధ‌ర్ గమాంగ్ ఈ నెల 25న బీజేపీకి రాజీనామా చేశారు. ఆయ‌న కుమారుడు శిశిర్ గ‌మాంగ్ కూడా బీజేపీకి రాజీనామా చేశారు.

9 సార్లు పార్లమెంటుకు ఎన్నిక..
ఒడిశా రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ గిరిధర్‌ గమాంగ్‌కు ప్రత్యేకత ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గమాంగ్‌ సొంత రాష్ట్రం నుంచి 9 సార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1972 నుంచి 2004 దాకా వరుసగా కోరాపుట్‌, లక్ష్మీపూర్‌ స్థానాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్‌ 6 వరకు సుమారు 10 నెలలపాటు ఒడిశా సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధిష్ఠానం వ్యవహారశైలి నచ్చక 2015లో బీజేపీలో చేరారు. కాగా, గిరిధర్‌ సతీమణి హేమ గమాంగ్‌ 1999లో ఎంపీగా వ్యవహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement