Saturday, April 20, 2024

న్యూడ్ వీడియోతో యువ‌కుడిని బెదిరించిన యువ‌తి .. త‌ర్వాత ఏం జ‌రిగిందంటే ..

ఆడ‌వారిని మ‌గ‌వారు బ్లాక్ మెయిల్ చేయ‌డం పాత ప‌ద్ద‌తి ..ఇప్పుడు కొత్త‌గా మ‌గ‌వారిని ..మ‌హిళ‌లు వేధింపుల‌కు గురి చేస్తోన్న ప‌లు సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి ప‌లు చోట్ల‌. కాగా గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి మండ‌లం కుర‌గ‌ల్లు గ్రామంలో ఓ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. క‌డియం రాజేష్ అనే యువ‌కుడికి ఫేస్ బుక్ లో ఓ యువ‌తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. ఇంకేముంది ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ‌యిన ఆ యువ‌కుడు యాక్సెప్ట్ చేసి ఆ యువ‌తితో ప‌రిచ‌యాన్ని పెంచుకున్నాడు. ఇక ఫోన్ నెంబ‌ర్లు ఇచ్చి పుచ్చుకున్నారు కూడా..

దాంతో రాజేష్ కు ప్ర‌తిరోజు ఫోన్ చేసి మ‌రింత ద‌గ్గ‌ర‌యిందా యువ‌తి. దాంతో రాజేష్ పూర్తిగా ఆమె మాటల మాయలో పడిపోయి ఆమె ఏం చెబితే అది చేయసాగాడు. ఈ క్రమంలోనే వీడియో కాల్ చేసిన యువతి ఇద్దరం న్యూడ్ గా మారి ముచ్చటిద్దామని కోరింది. మొదట యువతి న్యూడ్ గా మారడంతో రాజేష్ కూడా ఏమాత్ర ఆలస్యం చేయకుండా నగ్నంగా ఆమెతో ముచ్చటించాడు. అప్పటివరకు మాయమాటలతో మభ్యపెట్టిన యువతి తన అసలురూపాన్ని బయటపెట్టింది. నగ్నంగా మాట్లాడిన వీడియోను చూపించి రాజేష్ ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. తాను అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోతే నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు దిగింది. మొదట ఆమె బెదిరింపులకు భయపడిన రాజేష్ కొంతసొమ్మును ముట్టజెప్పాడు. అయినప్పటికి యువతి వేధింపులు ఆగకపోవడంతో ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించాడు. తన నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని యువతి బెదిరిస్తోందంటూ మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement