Wednesday, April 24, 2024

Big Breaking: అంచ‌నాల‌ను పెంచేసిన న‌థింగ్ స్మార్ట్‌ఫోన్‌.. మరి కొద్దిసేపట్లోనే లాంచ్‌ లైవ్​లో చూడొచ్చు!

గ్యాడ్జెట్స్ ల‌వ‌ర్స్‌లో ఎక్క‌డ‌లేని హైప్ క్రియేట్ చేసిన‌ నథింగ్ స్మార్ట్‌ఫోన్ ఇవ్వాల‌ (మంగ‌ళ‌వారం) రాత్రి 8.30కు లాంచ్ కానుంది. వన్ ప్లస్‌ మాజీ సీఈవో కార్ల్ పీ స్థాపించిన నథింగ్ కంపెనీ నుంచి వస్తున్న తొలి మొబైల్‌ కావడంతో దీనిపై చాలామంది ఎన్నో ఆశ‌లు పెంచుకున్నారు. ప్రారంభం నుంచి ఈ ఫోన్‌పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కాగా, నథింగ్ ఫోన్‌-1 5జీ స్మార్ట్ ఫోన్‌ మరికొన్ని గంటల్లోనే లాంచ్ కానుంది. నథింగ్ ఫోన్-1 లాంచ్ ఈవెంట్ ఇవ్వాల‌ (జులై 12) భార‌త కాల‌మానం ప్ర‌కారం 8.30 గంట‌ల నుంచి ప్రారంభం కానున్న‌ట్టు కంపెనీ తెలిపింది. ఈ ఈవెంట్ లండన్, UKల‌లో నిర్వ‌హిస్తున్నారు. ఈ ఈవెంట్‌ని కంపెనీ అధికారిక YouTube చానెల్‌లో లేదా, వారి వెబ్‌పేజీలో 8:30 గంట‌ల నుండి ప్రత్యక్ష ప్ర‌సారం ద్వారా చూడొచ్చు.

ఇక్కడ క్లిక్​ చేయడం ద్వారా లైవ్​ చూడొచ్చు

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement