Thursday, April 25, 2024

Telangana: ఒక్కసారి కాదు.. వందసార్లైనా మొక్కుతా: డీహెచ్​ శ్రీనివాసరావు

తెలంగాణ హెల్త్​ డైరెక్టర్​ గడల శ్రీనివాసరావు ఇవ్వాల (ఆదివారం) సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెంలో జరిగిన వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న గడల సీఎం కేసీఆర్​ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను షేర్​ చేసుకున్నారు. సీఎం కేసీఆర్​ తనకు పితృ సమానులని, ఆయన పాదాలను తాకడం తన అదృష్టంగా భావిస్తా అన్నారు. ఈ మధ్య ప్రగతి భవన్​లో 8 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్​ కాలేజీల ప్రారంభ కార్యక్రమంలో డీహెచ్​ గడల శ్రీనివాసరావు సీఎం కేసీఆర్​కు పాదాభివందనం చేశారు. అయితే దీనిపై అప్పటి నుంచి చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్​ చేస్తూ వస్తున్నారు. కాగా, ఆ కామెంట్స్​కి ఇవ్వాల పుల్​స్టాప్​ పెట్టేశారు గడల శ్రీనివాసరావు.

తనపై కొందరు పనిగట్టుకుని కామెంట్స్​ చేస్తున్నారని, ఈ విషయంపై రాద్ధాంతం అవసరం లేదన్నారు డీహెచ్​ శ్రీనివాసరావు. ప్రత్యేక తెలంగాణ సాధించిన జాతిపితగా, బంగారు తెలంగాణ సాధన దిశగా సాగుతున్న పరిపాలనాధ్యక్షుడిగా ఉన్న సీఎం కేసీఆర్​ని తాను పితృ సమానులుగా భావిస్తానన్నారు. కేసీఆర్​తో ఫొటో దిగడ, ఆయన పాదాలను తాకడం తాను ఎంతో అదృష్టంగా భావిస్తానన్న విషయాన్ని కొవిడ్​ సమయంలోనే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. ఇకపై ఈ విషయాన్ని వదిలేయాలని, దీన్ని రాద్ధాంతం చేయొద్దని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement