Thursday, April 25, 2024

క్యాన్స‌ర్ ని జ‌యించిన అధీరా – లైఫ్ లో గెల‌వాల్సిందే – సంజ‌య్ ద‌త్త‌

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ ద‌త్ లైఫ్ లో ఎన్నో ఒడి దుడుకులు ఎదుర్కొన్నాడు. క్యాన్స‌ర్ బారిన ప‌డి కోలుకున్నారు. ఇక‌ ట్రీట్ మెంట్ తీసుకుంటూనే షూటింగ్‌లో పాల్గొని..ఎంతో మంది న‌టీన‌టుల‌కు స్ఫూర్తిగా నిలిచాడు. రీసెంట్ గా కెజియఫ్ 2లో అధీరా పాత్రలో మెరిశారు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ ద‌త్. అధీరా పాత్ర‌లో క‌నిపించి ఆడియన్స్ ను ఇంప్రెస్ చేశారు. ఈ మూవీతో సంజయ్ ద‌త్ మరోసారి తన విశ్వరూపం చూపించారు. సోష‌ల్ మీడియాలో కూడ ఈ మధ్య ఫుల్ యాక్టీవ్ గా ఉంటున్నారు. సినిమాతోనే తనకు గౌరవం అంటున్న సంజయ్. ఆ సినిమాతో పాటు జీవితంలో కూడా గెలవడం చాలా ఇంపార్టెంట్ అని తెలిపారు. రీసెంట్ గా తన సోషల్ మీడియా పేజ్ లో హ్యాండిల్‌లో ఇంటెన్స్ వ‌ర్క‌వుట్ స్టిల్ నుపోస్ట్ చేసి ఔరా అనిపించారు. జిమ్‌లో భారీ చైన్ల‌ను పైకి లేపుతూ ఉన్న స్టిల్ ను షేర్ చేస్తూ..నువ్వు గెలిచే దాకా నీ క‌థ గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోరు. అందుకే గెల‌వండి అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు. ఇపుడు ఈ పోస్టు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.కాన్సర్ అని తెలియడంతో తన పని అయిపోతుందనుకుని చాలా బాధపడ్డారు సంజయ్ దత్. కాని మనో ధైర్యంతో పాటు ప్యామిలీ సపోర్ట్ తో కాన్సర్ ను జయించారు. ట్రీట్ మెంట్ తరువాత సినిమాల స్పీడ్ పెంచారు సంజయ్ దత్. కెజియఫ్2 రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక బాలీవుడ్ లో మరో మూడు సినిమాలు చేస్తున్నారు. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో వ‌స్తున్న‌ షంషీరా సినిమాలో ర‌ణ్ బీర్ క‌పూర్‌తో క‌లిసి స్క్రీన్ శేర్ చేసుకుంటున్నాడ సంజయ్. దీంతోపాటు ర‌వీనాటాండ‌న్‌తో ఘూడ్‌చ‌డి చేస్తున్నాడు. అక్ష‌య్ కుమార్ లీడ్ రోల్ చేస్తున్న పృథ్విరాజ్ సినిమాలో పృథ్విరాజ్ అంకుల్‌గా అంధుడి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement