Tuesday, April 23, 2024

నాలుగు ఓట్ల కోసం.. ఝూటా మాటలొద్దు

ఉమ్మడి కరీంనగర్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: హుజురాబాద్‌ ఎన్నికల ఫలితాలు ఏడేళ్ల తెరాస పాలనకు, మోడీ ఏడేళ్ల పాలనకు మధ్య రెఫరెండంగా తీసుకుందామా అంటూ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు సవాల్‌ విసిరారు. శనివారం హుజురాబాద్‌ టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ఏ మీటింగ్‌కు వెళ్లినా కరెం ట్‌ కట్‌ చేస్తున్నారని, వేధిస్తున్నారని, ప్రజల్లో సానుభూతి పొందేందుకు ఈటల రాజేందర్‌ చిలిపి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. శంకర్‌ నందన్‌ హా ల్‌లో మీటింగ్‌ పెట్టుకుంటే ఈటల మైక్‌ మూగోయింది. దానికి టీఆర్‌ఎస్‌ వాళ్లు కరెంట్‌ కట్‌ చేశారని గోబెల్స్‌ ప్రచారం చేశారు. దుష్ప్రచారం బాగా సోషల్‌ మీడియాలో చేశారని ధ్వజమెత్తారు. వారి ఫ్యూజులు వాళ్లే పీక్కొని కరెంట్‌ కట్‌ చేసుకుని సానుభూతి పొందే ప్రయత్నం చేశారని, కానీ విద్యుత్‌ శాఖ వాళ్లు శంకర్‌ నందన్‌ ఫంక్షన్‌ హాల్‌ వాళ్లు కరెంట్‌ బిల్లు కట్టలేదని విద్యుత్‌ కట్‌ చేశారని చెప్పారని వివరించారు. రాత్రి 10 గంటల సమయంలో టీఆర్‌ఎస్‌ వాళ్ల కారు, అందులో డబ్బులు, మద్యం ఉందని డ్రైవర్‌ తాగి గుద్దారని నానా యాగీ చేశారని, చివరకు సీసీ కెమెరా చూసి పోలీసులు కారును పట్టుకుంటే విశ్వనాథ్‌ ఆనంద్‌ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సన్నిహతుడు అతని కుమారుడు అని తేలిందన్నారు. దీన్ని ఏరకంగా సమర్థిస్తాడు. దీని పై మళ్లిd ఒక్క మాట మాట్లాడలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌పై 291 రూపాయల పన్ను వేస్తుందని, దాన్ని తొలగించవచ్చు కదా అని ఇంటింటికి బీజేపీ రాష్ట్ర నేతల మొదలు, ఇంటింటికి ప్రచారం చేస్తున్నారని హుజురాబాద్‌లో అంబేద్కర్‌ వద్దకు వస్తా, పదవికి రాజీనామా చేస్తా మీరు పోటీ నుంచి తప్పుకుంటా అని మాట్లాడి రెండు రోజులైందని, కాని ఇప్పటి వరకు మాట్లాడలేదని అన్నారు. ఆర్థిక మంత్రిగా నేను రాజీనామాకు రెడీ అన్నా.. రెండు రోజులైంది మాట్లాడటం లేదు. కమలాపురంలో ఈటల రాజేందర్‌ శంభునిపల్లిలో మాట్లాడారు.

శంభునిపల్లిలో మహిళలకు వడ్డీలేని రుణానికి సంబంధించి ఫేక్‌ చెక్కులు ఇచ్చారు. దీన్ని ఈనెల 30లోగా చెక్కులు క్లియర్‌ చేయాలని అన్నారు. 25 కోట్ల 89 లక్షల రూపాయలు ఐదు మండలాలలో ఇచ్చినం. బతుకమ్మ పండుగ ముందు అందరి అకౌంట్లలో పడ్డాయి. మహిళలు కూడా డబ్బులు వచ్చినయ్‌ అని మంత్రి హరీష్‌రావు చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పండుగ పూట వడ్డీలేని రుణం ఇస్తే, బీజేపీ ప్రభుత్వం గ్యాస్‌ ధరపెంచిందని చెప్పారు. బట్ట కాల్చి మీద వేస్తామని అంటే విశ్వసనీయత ఉంటుందా మేం మద్యం, మాంసం పంచామని, 20 వేలు ఇస్తున్నారని ప్రజలను మోసం చేస్తున్నారని, ఆరుసార్లు ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే హుజురాబాద్‌ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. అంటే హుజురాబాద్‌ ప్రజలు కించపరుస్తున్నారు. సర్పంచ్‌లను, ఎంపీటీసీలు నాయకుల పట్ల అలాగే మాట్లాడుతున్నారు. గ్రైండర్లు, గడియారాలు, కుట్టుమిషన్లు పంచింది ఎవరు, వారిని ప్రజలు తిరస్కరించి నేల మీద కొట్లారన్నారు. టీఆర్‌ఎస్‌ చేసిందే చెప్పింది, మేం ఢిల్లిdకి గుళాంలు కాదు అని ప్రజలకే గుళాంలమన్నారు. మీడియాలో వచ్చే ఫేక్‌ ప్రచారాలు, కరపత్రాల రూపంలో చేసే విష ప్రచారాన్ని తిప్పి కొట్టండని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజేందరన్న మీరు బీజేపీ అనే బురద గుంతలో దిగారు. బురద అంటకుండా ఉంటుందా అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను, రైళ్లను, విమానాశ్రయాలు అమ్ముతున్నారు దీని వల్ల బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రిజర్వేషన్లు ఎత్తివేస్తున్నారు. దీన్ని సమర్థిస్తారా అని ప్రశ్నించారు. ఇది అభివృద్దికి అరాచకానికి, న్యాయానికి – అన్యాయానికి, ధర్మానికి – అధర్మానికి మధ్య పోటీ అన్నారు. ధరలు పెంచే వాళ్లు ఓ వైపు ఉంటే మేం సంక్షేమం చేపడుతున్నామని అన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారని, ఇవన్ని దాన్ని ఇచ్చినట్లుగా, ప్రజలు తీసుకున్నట్లుగా వారి ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్నారని హరీష్‌రావు అన్నారు. ప్రజాస్వామ్యంలో మంచి చర్చ జరగాలి. ఏడేళ్ల బీజేపీ పాలన టీఆర్‌ఎస్‌ పాలనకు రిఫరెండంగా తీసుకుందామా అని రాజేందర్‌కు మంత్రి సవాల్‌ విసిరారు.

ఇది కూడా చదవండి.. మొక్కల పెంపకంలో దేశానికి దిక్సూచి తెలంగాణ

Advertisement

తాజా వార్తలు

Advertisement