Friday, October 4, 2024

ఏపీ ఆశలపై కేంద్రం నీళ్లు

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం మరోసారి నీళ్లు చల్లింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. లోక్ సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్‍నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద్‍రాయ్ సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చామని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలున్నాయని, అయితే, పరిష్కారం తమ చేతుల్లో లేదన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలన్నారు.

కాగా, ఇప్పటికే అనేక సార్లు ప్రత్యేక హోదాతోపాటు పలు అంశాలపై సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులను విన్నవించారు. అయినా కేంద్రం మాత్రం తమ వైఖరిని తెలియజేసింది. ఇదిలా ఉంటే గతంలో కూడా కేంద్రం పార్లమెంట్ సాక్షిగా స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదని చాలాసార్లు స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యయమని.. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని 14వ ఆర్ధిక సంఘం కూడా చెప్పిందని కేంద్రం స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement