Thursday, April 25, 2024

మనుషులకు బర్డ్‌ ఫ్లూ సోకుతుందా?

దేశంలో పలు రకాల వైరస్ లు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దేశం కరోనాతో అల్లాడుతుంటే… డెల్టా వేరియంట్, జీకా వైరస్, బర్డ్ ఫ్లూ లాంటి వైరస్ లు కలవరానికి గురి చేస్తున్నాయి. మంగళవారం దేశంలో తొలి బర్డ్ ఫ్లూ మానవ మరణం సంభవించింది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హర్యానాకు చెందిన 11 ఏళ్ల బాలుడు మంగళవారం మృతి చెందాడు. దేశంలో ఈ ఏడాది నమోదైన తొలి హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్‌ ఫ్లూయెంజా (బర్డ్ ఫ్లూ) మరణం ఇదే కావడం గమనార్హం. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకే ప్రమాదం ఉందని హెచ్చరికలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌ చీఫ్ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు.

బర్డ్‌ఫ్లూ వైరస్‌ మనుషుల నుంచి మనుషులకు సోకే అవకాశం చాలా అరుదని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.  హెచ్‌5ఎన్‌1 వైరస్‌ పక్షుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందడం చాలా అరుదేనని తెలిపారు. ఈ వైరస్‌ మనుషుల నుంచి మనుషులకు సోకడం గుర్తించలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే, ఫౌల్ట్రీల్లో పని చేసే వారంతా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా మరో పేరు!

Advertisement

తాజా వార్తలు

Advertisement