Thursday, April 25, 2024

ఇక‌పై జైళ్ల‌ల్లో వీఐపీ గ‌దులు ఉండ‌వ్ – పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్

వీఐపీ సంస్కృతికి స్వ‌స్తి ప‌ల‌కాల‌నే ఉద్దేశ్యంతో జూలు సిబ్బంది స‌జావుగా ప‌ని చేసేందుకు వీలుగా జైళ్ల‌లోని అన్ని వీఐపీ గ‌దుల‌ను ..జైలు నిర్వ‌హ‌ణ బ్లాక్ లుగా మారుస్తామ‌న్నారు పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్. జైలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులను బాధ్యులను చేసి కఠిన చర్యలు తీసుకుంటాం అని భగవంత్ మాన్ స్ప‌ష్టం చేశారు. జైలు ప్రాంగణంలో గ్యాంగ్‌స్టర్ల 710 మొబైల్ ఫోన్‌లను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు పంజాబ్ సీఎం చెప్పారు. ‘‘ మేం మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నాం. దీనితో పాటు లోపల ఫోన్‌లను తీసుకున్న వారిపై కూడా చర్యలు తీసుకున్నాం. దీనిపై విచారణ చేేసేందుకు సిట్ ఏర్పాటు చేశాం. ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదు చేస్తున్నాం. మేం కొంతమంది అధికారులను కూడా సస్పెండ్ చేశామ‌ని సీఎం వెల్ల‌డించారు. పంజాబీ పాటలలో తుపాకీ సంస్కృతి. డ్రగ్స్‌ను ప్రోత్సహించడాన్ని ఆయన ఖండించారు. గాయకులు తమ పాటల ద్వారా సమాజంలో హింస, ద్వేషం, శత్రుత్వాన్ని పెంచవద్దని కోరారు. మీరందరూ పంజాబ్, పంజాబీ యాత్ నీతిని అనుసరించాలి. అలాంటి పాటల ద్వారా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు ఆజ్యం పోసే బదులు సోదరభావం, శాంతి, సామరస్య బంధాలను బలోపేతం చేయాల‌ని చెప్పారు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పంజాబ్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడంలో గాయకులు బాధ్యత వహించాలని, నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement