Saturday, April 20, 2024

TSRTC: అదనపు ఛార్జీలు లేకుండానే ప్రయాణం.. సంక్రాంతికి ప్రత్యేక బస్సులు ఆహ్వానం

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సందడి మొదలైంది. ప్రయాణికులు సొంతుళ్లకు పయనమవుతున్నారు. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. రాజధాని హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 4,318 ప్రత్యేక బస్సులను నడపుతున్నారు. అయితే టీఎస్ఆర్టీసీ మాత్రం ఏ విధమైన అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదు.

సంక్రాంతి సందర్భంగా ఏపీలోని ముఖ్యమైన ప్రాంతాలన్నింటికీ హైదరాబాద్‌లోని వివిధ పాయింట్ల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్, మియాపూర్, కేపీహెచ్‌బీ కాలనీ, దిల్‌సుఖ్‌నగర్‌, ఈసీఐఎల్‌, ఎల్బీ నగర్, ఆరాంఘర్ పాయింట్ల నుంచి ఏపీకి బస్సులు నడపనున్నారు. టీఎస్ఆర్టీసీ ఆఫర్ తో ప్రయాణికులు ఈ బస్సుల్లోనే ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.  ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల కోసం ఆర్టీసీ మొత్తం 4,318 ప్రత్యేక బస్సులు  నడపబడుతున్నామని ఎండీ సజ్జనార్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement