Friday, March 29, 2024

Breaking: నో చీఫ్ గెస్ట్స్​.. ఈ ఏడాది కూడా రిపబ్లిక్ డే ఈవెంట్‌కు విదేశీ ప్రముఖులెవరూ రారు

జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధులుగా రావాలని ఐదు మధ్య ఆసియా దేశాల (CA-5) నాయకత్వాలను భారతదేశం ఆహ్వానించింది. అయితే, కరోనావైరస్ ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్నందున్న ఈసారి అతిథులను ఆహ్వానించడం లేదని అధికారిక వర్గాలు తెలిపాయి. కొవిడ్ ఇన్‌ఫెక్షన్ల పెరుగుదల నేపథ్యంలో మహమ్మారి దశ, న్యూఢిల్లీ కజాకిస్తన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ నాయకులకు ఆతిథ్యం ఇవ్వడం లేదని తెలుస్తోంది.

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, CA-5కి ప్రాతినిధ్యం వహిస్తున్న అతని సహచరుల మధ్య ఇటీవల జరిగిన మూడవ సమావేశంలో నాయకులకు ఆహ్వానం అందంది. కానీ, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉన్నత స్థాయి పర్యటనలను రద్దు చేయాల్సి రావడం ఇది వరుసగా రెండో ఏడాదిగా చెప్పుకోవచ్చు. గత సంవత్సరం UK ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ రిపబ్లిక్ డే వేడుకలలో పాల్గొనడానికి రావాల్సి ఉంది. అయితే Covid-19 మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలు ఉండడటంతో చివరి నిమిషంలో బోరిస్ పర్యటన రద్దు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement