Thursday, March 28, 2024

పసిడి ప్రియులకు ఊరట: స్థిరంగా బంగారం ధరలు

పసిడి ధరలు స్వల్ప ఊరటనిచ్చాయి. బంగారం, వెండి ధరలలో ఈ రోజు ఎలాంటి మార్పులు లేవు. పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.49,100గా ఉంది. అలాగే 22 గ్రాములకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.45 వేల వద్ద కొనసాగుతోంది. అయితే వెండి ధర మాత్రం రూ.400 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.65,500 వద్ద ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.47,150గా ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,440గా నమోదైంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.47,080గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,080గా నమోదైంది. కేజీ వెండి ధర రూ.61,600గా నమోదైంది.

చెన్నైలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.45,370గా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.49,450 వద్ద కొనసాగుతోంది. వెండి ధర రూ.65,500గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.45 వేలుగా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.49,100గా నమోదైంది. కిలో వెండి ధరలు రూ.65,500గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement