Tuesday, April 16, 2024

స్థిరంగా బంగారం.. పెరిగిన వెండి ధర.. నేటి రేట్లు ఇలా..

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే, ఆలస్యం చేయోద్దు. నిన్నటి వరకు తగ్గిన బంగారం, వెండి ధరలు ఇవాళ షాక్ ఇచ్చారు.  గ‌త రెండు రోజుల పాటు భారీగా త‌గ్గిన బంగారం ధర ఈ రోజు స్థిరంగా కొనసాగుతోంది.అయితే, వెండి ధ‌ర‌ మాత్రం స్వ‌ల్పంగా పెరిగాయి.

హైద‌రాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.44,600 వద్ద స్థిరంగా ఉంది. అదేసయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.48,650గా ఉంది. వెండి ధ‌ర రూ.100 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ. 64,600కి చేరింది.

విజ‌య‌వాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.44,600గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,650గా ఉంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ.64,600గా నమోదైంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 46,750గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,000గా ఉంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 60,700గా వద్ద కొనసాగుతోంది.

ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 46, 600గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 48,600గా నమోదైంది. అలాగే కిలో వెండి ధ‌ర రూ. 60,700 గా ఉంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement