Thursday, April 18, 2024

GOLD RATE: మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం ధర.. తగ్గిన వెండి రేటు..

బంగారం కొనుగోలు భావించే వారికి గుడ్ న్యూస్. పసిడి ధర గత రెండు రోజులుగా నిలకడగా కొనసాగుతోంది. బంగారం ధర నేడు కూడా స్థిరంగానే ఉంది. బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. అయితే, వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,830 వద్దనే కొనసాగుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,760 వద్ద ఉంది.

బంగారం ధర నిలకడగా కొనసాగితే.. వెండి ధర మాత్రం తగ్గింది. గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన వెండి రేటు ఈరోజు రూ.600 పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ.65,000కు చేరింది. బంగారం ధర స్థిరంగా కొనసాగడం, వెండి ధ‌ర‌లు త‌గ్గ‌డంతో ప్రజలు కొనేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement