Wednesday, April 24, 2024

డిక్లరేషన్ పేరుతో కొత్త డ్రామాలు: రాహుల్ సభపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్‌ పై తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మేనిఫెస్టోలోని ఏ హామీని కాంగ్రెస్ అమలు చేయలేదని విమర్శించారు. హామీలు అమలు చేయకపోవడంతోనే పంజాబ్ లో ఓడిపోయారని పేర్కొన్నారు. పంజాబ్‌లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో కొత్త డ్రామాలు ఆడుతున్నదని మంత్రి నిరంజన్‌ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలోనే డిక్లరేషన్‌ చేస్తరా.. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో డిక్లరేషన్‌ చేయరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలను ప్రజలు నమ్మరని అన్నారు. తెలంగాణ నేతలను క్షమించడానికి రాహుల్ ఎవరు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు ఎప్పుడో శిక్షించారని చెప్పారు. 2014లో ఎన్నికల్లో రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ చెప్పినప్పటికీ.. రూ.లక్ష మాఫీ చేస్తామన్న టీఆర్‌ఎస్‌నే తెలంగాణ ప్రజలు నమ్మారని వెల్లడించారు. ప్రతి ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఘోర వైఫల్యం వల్లే దేశానికి ఈ దుస్థితి అని వ్యాఖ్యానించారు. రైతులకు కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. నిన్నటి కాంగ్రెస్ సభ మానసిక సంఘర్ణణ సభ అని ఎద్దేవా చేశారు. 75 ఏళ్ల కాలంలో రైతుబీమా గురించి ఏనాడైనా ఆలోచించారా ? అని రాహుల్‌ గాంధీని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధుతో రైతుల ఖాతాల్లో రూ.50 వేల కోట్లు జమ చేసిందని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement