Monday, September 20, 2021

కేరళలో నిపా వైరస్.. 48 మందికి హై రిస్క్

కేర‌ళ‌లో నిపా వైర‌స్ కలకలం రేపుతోంది. ఓవైపు కరోనా మహమ్మారి రాష్ట్రంలో విజృభిస్తుండగా.. మరోవైపు నిపా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటి నిపా వైరస్ సోకి ఓ బాలుడు మృతిచెందాడు. అయితే ఆ బాలుడితో కాంటాక్ట్‌లోకి వ‌చ్చిన వారి శాంపిల్స్ ను పుణెలోని వైరాల‌జీ ఇన్స్‌టిట్యూట్‌కి పంపారు. మొత్తం 24 నాలుగు శ్యాంపిళ్లు పంప‌గా.. అందులో 8 మంది శ్యాంపిళ్లు నెగ‌టివ్‌గా తేలింది. ఇందులో ఆ బాలుడి తల్లిదండ్రులు, హెల్త్‌కేర్ వ‌ర్క‌ర్లు ఉన్నారు. ఈ మేరకు కేర‌ళ ఆరోగ్య‌శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఆ 8 మంది నెగ‌టివ్ రావ‌డం కొంత ఊర‌ట‌నిచ్చే అంశ‌మ‌ని అన్నారు. మ‌రిన్ని శాంపిల్స్ ను కూడా టెస్టింగ్ చేస్తున్న‌ట్లు ఆమె చెప్పారు. ఆ ప్రాంతం అంతా నిఘా పెట్టిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు. ఇంటి ఇంటిని స‌ర్వే చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.

నిపాతో చ‌నిపోయిన బాలుడితో సుమారు 251 మంది కాంటాక్ట్‌లోకి వ‌చ్చిన‌ట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 129 మంది హెల్త్ కేర్ వర్కర్లు ఉన్నారని ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది. ఇప్ప‌టికే 48 మందిని మంది హెల్త్ కేర్ వ‌ర్క‌ర్ల‌ను హై రిస్క్ జాబితాలో చేర్చారు. 48 మందిలో 31 మంది కోజికోడ్ కి చెందిన వారు కాగా.. వయనాడ్ నుండి నలుగురు, మలప్పురం నుండి 8 మంది, కన్నూర్ నుండి ముగ్గురు, పాలక్కాడ్, ఎర్నాకులం జిల్లాల నుండి ఒక్కొక్కరు ఉన్నారు.

కోజికోడ్ మెడిక‌ల్ కాలేజీలోనే ఆ శాంపిల్స్ ను ప‌రీక్షిస్తున్నారు. పుణెలోని వైరాల‌జీ ఇన్స్‌టిట్యూట్‌కు చెందిన నిపుణులు.. కోజికోడ్ మెడిక‌ల్ కాలేజీలో తాత్కాలిక టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. అయితే అక్క‌డ టెస్ట్ చేసిన సాంపిళ్లను మ‌ళ్లీ పుణె ఇన్స్‌టిట్యూట్‌లో రీటెస్టింగ్ చేయ‌నున్నారు. 

ఇది కూడా చదవండి: దేశంలో భారీగా తగ్గిన కరోనా.. కొత్త కేసులు ఎన్నంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News