Thursday, March 28, 2024

తెలంగాణలో కర్ఫ్యూ పొడిగింపు… కొత్త ఆంక్షలు ఇవే!

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతి రోజు పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం.. గతంలో విధించిన నైట్ కర్ఫ్యూను మరో వారం పాటు పొడిగించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న రాత్రి కర్ఫ్యూ శనివారంతో పూర్తి కానుండడంతో ప్రభుత్వం మళ్లీ వారం రోజుల పాటు పొడిగించింది. నైట్ కర్ఫ్యూ ఈనెల 15వ తేదీ ఉదయం 5గంటల వరకు కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఉన్న కోవిడ్ నిబంధనలే మే 15 వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్ఫ్యూ సందర్భంగా రాత్రి 8 గంటకు వ్యాపార సముదాయాలు, హోటళ్లు, ఇతర సంస్థలు మూసివేయాలని ఆదేశించారు.

తెలంగాణలో కోవిడ్‌ కేసులు విస్తరిస్తున్న నేపద్యంలో మరికొన్ని ఆంక్షలను ప్రభుత్వం ప్రకటించింది. వివాహాలు, ఇతర వేడుకల నిర్వహణపై ఆంక్షలు విధించారు.  పెళ్ళిళ్ళకు 100 మంది అతిధులను అనుమతించిన ప్రభుత్వం.. అంత్యక్రియలకు 20 మంది మించకూడదని సూచించింది. అది కూడా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని తెలిపింది. రాజకీయ పార్టీల సమావేశాలు, స్పోర్ట్స్‌, ఎంటర్‌ టెయిన్‌మెంట్‌, వంటి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. అందరూ కూడా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.  రాత్రి 9 తర్వాత ఎవరూ బయట తిరిగిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయితే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

ఇది కూడా చదవండి: తెలంగాణలో లాక్ డౌన్ ఎందుకు వద్దంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement