Wednesday, March 27, 2024

చ‌నిపోయినవారి అస్థిక‌ల‌తో న‌గ‌లు : ఎక్క‌డో తెలుసా

చ‌నిపోయిన‌వారి ఆస్థిక‌ల‌ను ఏం చేస్తాం.. న‌దుల్లో క‌లుపుతాం క‌దా అనుకుంటున్నారా..అయితే ఇప్పుడో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. మ‌ర‌ణించిన వారి దంతాలు, జుట్టు,గోళ్లు, అస్తిక‌ల‌తో న‌గ‌లు త‌యారు చేస్తార‌ని మీకు తెలుసా..ఉదాహ‌ర‌ణ‌కి ఓ ఉంగరం తయారుచేస్తే… ఆ ఉంగరం రాయి లోపల జుట్టును భద్రపరుస్తారు. అందువల్ల ఎప్పటికీ ఆ జుట్టు అందులోనే ఉంటుంది.ప్రస్తుతం ఇలాంటి నగలు తయారుచేస్తున్న జ్యువెలరీ సంస్థల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొదట్లో ఇలాంటి వాటిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. చనిపోయిన వాళ్లను కూడా వదలకుండా వ్యాపారం చేసుకుంటారా అనే విమర్శలు వచ్చాయి. కానీ క్రమంగా ఈ కాన్సెప్ట్ ప్రజలకు దగ్గరవుతోంది.లవ్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్‌తో న్యూయార్క్‌కి చెందిన మార్గరెట్ క్రాస్ ఇలాంటి నగలు తయారుచేస్తున్నారు.

రింగ్, బ్రాస్‌లెట్, చైన్ ఇలా ఏదైనా సరే.. అందులో ఏదో ఒక చనిపోయిన వారి గుర్తు ఉంటుంది. ఎక్కువ నగల్లో జుట్టు ఉండేలా తయారుచేస్తున్నారు. కొన్ని ఉంగరాల్లో దంతాలను సెట్ చేస్తున్నారు.ఇక్కడో షాకింగ్ విషయం ఉంది. సాధారణ నగల కంటే ఇలాంటివి చాలా రేటు ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే వీటిని తయారుచెయ్యడం చాలా కష్టం. నగకు తగినట్లుగా అస్తికలను తయారుచేసి సెట్ చెయ్యాలనీ… అందుకు ఎక్కువ టైమ్, శ్రమ అవుతుందని చెబుతున్నారు. అయినప్పటికీ కొంత మంది ఎక్కువ ధర చెల్లించి వీటిని పొందుతున్నారు.ఈ నగలతో ఓ ప్రత్యేక ప్రయోజనం ఉంది. ఇవి అరుదైనవి, రక్త సంబంధీకులతో సంబంధం ఉండేవి కావడం వల్ల వీటిని ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, అత్యంత క్రియేటివిటీతో తయారుచేస్తున్నారు. కొన్ని నగలను బంగారం, కొన్నింటిని డైమండ్లతో చేస్తున్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు అనుకునేవారికి అత్యంత ఖరీదైన డైమండ్ వాడి రూపొందిస్తున్నారు.ప్రాచీనమైనవాటిని మనం యాంటిక్ పీస్ అంటాం. ఈ అస్తికల నగలు కూడా అలాంటివే అంటున్నారు తయారీదారులు. ఎందుకంటే… వీటికి విలువ కట్టలేమనీ… అమ్ముకోలేమని అంటున్నారు. పైగా ఇవి ప్రేమానుబంధాలకు గుర్తుగా ఉంటాయి కాబట్టి… ఇవి అమూల్యమైనవి అంటున్నారు. నిజ‌మేమ‌రి మ‌న కుటుంబీల‌కు సంబంధించిన‌వే కాబ‌ట్టి అవి గుర్తుగా ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement