Saturday, December 7, 2024

Flash: కామారెడ్డిలో నవ వదువు మిస్సింగ్

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ నవవధువు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. మధురానగర్ కాలనీకి చెందిన యమున అనే నవవధువు.. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి యమున బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో భర్త దత్తు ఆందోళనకు గురయ్యాడు. బంధువులు, స్నేహితుల ఇంటి వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో భర్త దత్తు దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, మూడు నెలల క్రితం దత్తుతో యమునకు వివాహం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement