Friday, March 29, 2024

Big Breaking | న్యూజిలాండ్​కి ముచ్చెమటలు.. భారత బౌలర్ల దాటికి వరుసగా వికెట్లు ఫట్​​

న్యూజిలాండ్​తో జరుగుతున్న  టీ20 సిరీస్​లో తొలి మ్యాచ్​లో ఓటమి చవిచూసిన టీమిండియా ఇవ్వాల (ఆదివారం) రెండో మ్యాచ్​ ఆడుతోంది. లక్నోలోని అటల్​ బిహారీ వాజ్​పేయి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్​లో భారత బౌలర్లు చెలరేగిపోతున్నారు. ఎలాగైనా ఈ మ్యాచ్​ని గెలవాలని కసిగా ఆడుతున్నారు. పకడ్బందీ బౌలింగ్‌తో కివీస్ బ్యాటర్లను కట్టుదిట్టం చేస్తున్నారు. దీంతో వికెట్లను కాపాడుకుంటూ పరుగులు చేయడంలో న్యూజిలాండ్‌ జట్టు తడబాటుకు గురవుతోంది. ఫలితంగా 18 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయింది ఆ జట్టు.

ఇక.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను ఫస్ట్‌ ఓవర్‌ నుంచే టీమిండియా కట్టుదిట్టం చేస్తోంది. దీంతో కివీస్‌ వరుసగా వికెట్లను చేజార్చుకుంది. 3.3 ఓవర్ల వద్ద తొలివికెట్‌ ఫిన్‌ అలెన్ ( 11) ను కోల్పోయిన కివీస్‌.. ఆ వెంటనే కాన్వే (11) వికెట్​ను కూడా పోగొట్టుకుంది. తర్వాత గ్లెన్‌ ఫిలిప్స్‌ (5), డారిల్‌ మిచెల్‌ (8), మార్క్‌ చాప్‌మన్‌ (14),  మైఖెల్​ బ్రేస్​వెల్​ (14), సోది (1), ఫెర్గూసన్​ (0) భారత బౌలర్ల ధాటికి క్రీజులో నిలబడలేకపోయారు. చివరగా శాంట్నర్​ 20, డఫీ 6 పరుగులతో నాటౌట్​గా నిలిచారు.

ఫలితంగా 18 ఓవర్లు ముగిసే సరికి కివీస్​ 8 వికెట్లు కోల్పోయింది.  ఇక.. నిర్ణీత ఓవర్లలో న్యూజిలాండ్​ జట్టు 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా టార్గెట్​ 100 గా ఉంది.. ఈ క్రమంలో భారత బౌలర్లు అర్షదీప్​సింగ్​ 2, హార్దిక్​పాండ్యా, వాషింగ్టన్​సుందర్​, చాహల్​, దీపక్​ హుడా, కుల్దీప్​ యాదవ్​ తలా ఒక వికెట్​ పడగొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement