Thursday, April 18, 2024

ఇజ్రాయోల్ లో కొత్త వైర‌స్ ‘ప్లోరానా’

New virus

క‌రోనాని మించిపోతోంది ఒమిక్రాన్. ఈ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న వారికి కూడా వ్యాపిస్తుంది. దాంతో మూడు, నాలుగు డోసులు ఇవ్వ‌డానికి కూడా సిద్ధ‌మ‌వుతున్నారు. కాగా ఇజ్రాయెల్ లో కొత్త వైర‌స్ క‌ల‌క‌ల సృష్టిస్తుంది. ఇది డ‌బుల్ ఇన్ఫెక్ష‌న్ అని తెలిపారు. కాగా ప్లోరానా దీనిని పిలుస్తున్నారు. కొవిడ్-19, ఇన్‌ఫ్లుయెంజాల డబుల్ ఇన్ఫెక్షనే ఫ్లోరోనా అని అధికారులు చెప్పారు.ఓ గర్భిణి ప్రసవించడానికి రాబిన్ మెడికల్ సెంటర్‌కు వెళ్లారు. ఆమెకు టెస్టులు చేయగా ఈ కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది.

ఆమెకు కొవిడ్-19తోపాటు ఇన్‌ఫ్లుయెంజా కూడా ఉన్నది. ఈ రెండింటి ఇన్ఫెక్షనే ఫ్లోరోనా అల్ అరేబియా అరబ్ న్యూస్ వెల్లడించింది. కాగా, కరోనాను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మందగించిన వారికి మరో డోసు వ్యాక్సిన్ ఇవ్వాలని ఆ దేశ అధికారులు నిర్ణయించారు. రోగ నిరోధక శక్తి తగ్గిపోయిన వారికి నాలుగో డోసును పంపిణీ చేయడం మొదలు పెట్టారు.ఇజ్రాయెల్‌లో మూడో డోసు వేసి నాలుగు నెలలు గడిచిపోయింది. ఈ నేపథ్యంలోనే దాని ప్రభావం తగ్గిపోవడం లేదా.. కొందరిలో రోగ నిరోధక శక్తి కూడా కొత్త వేరియంట్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కోల్పోవచ్చు. ఈ నేపథ్యంలోనే రోగ నిరోధక శక్తి మందగించిన వారికి నాలుగో డోసు వేయాలని అధికారులు నిర్ణయించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement