Friday, April 19, 2024

RRR : రామ్, భీమ్ న్యూ లుక్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల మల్టీస్టారర్ చిత్రం ‘RRR’ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళిలు బిజీబిజీగా గడుపుతున్నారు.

తాజాగా ఈ సినిమాలో రామ్, భీమ్ పాత్రలకు సంబంధించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కొత్త స్టిల్స్ విడుదలయ్యాయి. పోలీస్ గెటప్‌లో రాంచరణ్, బ్లూ షర్ట్-ధోతీ గెటప్‌లో ఎన్టీఆర్ లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ మూవీలో మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజుగా రామ్ చారణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. సినిమాలో రాంచరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలీవియా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ టీజర్, ట్రైలర్, సాంగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాని తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మళయాలం భాషల్లో విడుదల చేయనున్నారు. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ తో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement