Friday, March 29, 2024

RRR: కొండ‌పై ఎన్టీఆర్, చెర్రీ.. ఏం చేస్తున్నారంటే..

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.  అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే..ఈ మూవీ జనవరి 7న విడుదలై థియేటర్లలో సందడి చేసేంది. అయితే, కరోనా ఉద్ధృతి నేపథ్యంలో సినిమా రిలీజ్ వాయిదా పడింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురైయ్యారు. అయితే, ఈ మూవీ టీం.. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి చెర్రీ, తార‌క్ కు సంబంధించిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఈ సినిమాలో కొండ‌పై న‌డుస్తూ వెళ్తున్న‌ట్లు ఈ కొత్త ఫొటోలో ఉంది. ఎన్టీఆర్ చేతిలో కర్ర ప‌ట్టుకుని ఉండగా.. ఆయ‌న ప‌క్క‌నే జేబులో చేతిని పెట్టుకుని చెర్రీ ఉన్నాడు. వీరిద్ద‌రూ న‌వ్వుతూ ఉన్న ఈ ఫొటో అల‌రిస్తోంది. సంక్రాంతి సందర్భంగా మూవీ టీం ఈ ఫొటోను పోస్ట్ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement