Wednesday, April 24, 2024

మహమ్మారి బాధితులకు కొత్త చిక్కులు.. కొవిడ్‌ సోకినవారిలో రక్తం గడ్డకట్టే సమస్య..

న్యూఢిల్లి : కొవిడ్‌-19 సోకిన వ్యక్తుల్లో రక్తం గడ్డకట్టే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. కరోనా వైరస్‌ కారణంగా రక్తం గడ్డకట్టే ప్రమాదం అధికంగా ఉంటోందని పేర్కొంది. స్వీడన్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన అంతర్జాతీయ పరిశోధకుల బృందం 10 లక్షల మందికిపైగా వ్యక్తులపై పరీక్షలు జరిపింది. ఫిబ్రవరి 2020 – మే 2021 మధ్య వైరస్‌ సోకిన వారికి ప్రతికూల పరీక్షలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫలితాలను బీఎంజే జర్నల్‌లో బుధవారం ప్రచురించింది. కొవిడ్‌ బారిన పడిన తర్వాత 3-6 నెలల తర్వాత కాళ్లు లేదా ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టినట్లు నిర్దారణ అయ్యే సంకేతాలను గుర్తించారు. ప్రత్యేకంగా కొవిడ్‌ రోగులలో డీప్‌ సిరత్రాంబోసిస్‌ ప్రమాదం కనుగొన్నారు. కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ తర్వాత మూడు నెలల వరకు తొడ లేదా దిగువ కాలిభాగంలో ఏర్పడుతుంది.

రోగులకు పల్మనరీ ఎంబోలిజం ఏర్పడే ప్రమాదం ఉంది. ఆపై ఆరు నెలల వరకు ఊపిరితిత్తుల దమనిలోని రక్తనాళాలు గడ్డకడతాయి. ప్రస్తుత పరిశోధనలు ప్రధాన విధానపరమైన చిక్కులను కలిగివున్నాయని రచయితలు పేర్కొన్నారు. కొవిడ్‌-19కు వ్యతిరేకంగా టీకా ప్రాముఖ్యతను పరిశోధన బలపరిచింది. రక్తంగడ్డకట్టినట్లు గుర్తిస్తే, ప్రతిస్కందక ఔషధాలు తీసుకోవాలని సూచించింది. పరిశోధన సమయంలో, కొవిడ్‌ రోగులలో 401 డీవీటీ కేసులను గుర్తించింది. సాధారణ రోగులలో ఈ సంఖ్య 267గా ఉంది. కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ నుంచి వచ్చే రోగ్‌ యాంటీబాడీస్‌ రక్తనాళాలు గడ్డకట్టే నిరోధక లక్షణాలు కోల్పోతాయని మిచిగాన్‌ మెడిసిన్‌ నేషనల్‌ హార్ట్‌-లంగ్‌-బ్లడ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనం సూచించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement