Monday, November 29, 2021

క‌త్రినా పెళ్లికి కొత్త హెన్నా.. స్పెషాలిటీ ఏంటో తెలుసా!

బాలీవుడ్ భామ క‌త్రినా కైఫ్ పెళ్లికి సిద్ధ‌మైంది. వ‌చ్చేవార‌మే పెళ్లి. వ‌రుడు వికీ కౌశ‌ల్ అని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. పెళ్లి వేడుక‌ల‌న్నీ రాజ‌స్ధాన్‌లో జ‌ర‌ప‌బోతున్నారు. ఈపాటికే ఏర్పాట్ల‌న్నీ పూర్త‌య్యాయి. ఆ విశేషాల‌న్నీ క‌థ‌లుక‌థ‌లుగా చెప్పుకుంటున్నారు. జోథ్‌పూర్ పాలీ జిల్లాలో ప్ర‌త్యేకంగా త‌యార‌య్యే హెన్నాని క‌త్రినా మెహందీ వేడుక‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా చెబుతున్నారు.

ఆ హెన్నా పేరు సోజ‌త్ హెన్నా. ప‌ల్లె జాన‌ప‌ద‌ క‌ళాకారులు ఎలాంటి ర‌సాయ‌నాలు లేకుండా స‌హ‌జ‌సిద్ధ‌మైన మూలిక‌ల‌తో ఆ హెన్నాని త‌యారుచేస్తారు. అంతేకాదు. దాని త‌యారీకి యంత్రాలు వాడ‌రు. కేవ‌లం మ‌నుషులే స్వ‌యంగా త‌మ చేతుల మీదుగా త‌గిన పాళ్ల‌లో క‌ల‌పాల్సిన మూలిక‌లు క‌లిపి త‌యారుచేస్తార‌ని చెబుతున్నారు.

క‌త్రినా కోసం ప్ర‌త్యేకంగా త‌యారుచేస్తున్న ఆ హెన్నా యాభ‌య్ వేల రూపాయ‌లు అవుతుంద‌ని తెలిసింది. అయితే ఆ వ్యాపార‌వేత్త క‌త్రినాకు ఉచితంగానే స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. రాయ‌ల్ వెడ్డింగ్ కంటే ముందే వాళ్లిద్ద‌రూ ముంబాయిలోని ఒక కోర్టులో దండ‌లు మార్చుకుని వివాహ వేడుక‌ను చ‌ట్ట‌బద్దం చేసుకుంటారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News