Thursday, April 25, 2024

Corona variant: బ్రిటన్ లో మరో కొత్త వేరియంట్..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. నిత్యం కొత్త కొత్త రూపాలు మార్చుకుని వణికిస్తోంది. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వివిధ దేశాల్లో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి విజృంభిస్తున్నాయి. తాజాగా బ్రిటన్‌ సహా ఐరోపాను డెల్టా ప్లస్‌ (AY.4.2) వేరియంట్‌ ఆందోళన కలిగిస్తోంది. డెల్టా కంటే అత్యంత ప్రమాదకరమైన ఈ వేరియంట్ కేసులు భారత్‌లో స్వల్పంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

డెల్టా ప్లస్‌ వేరియంట్‌ను యూకే ఆరోగ్య భద్రత సంస్థ వేరియంట్‌ అండర్‌ ఇన్వెస్టిగేషన్‌ (VUI21OCT-01) గా పేర్కొంది. డెల్టాను మించిన వేగంతో ఇది వ్యాపిస్తున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూకే, రష్యాలో కేసుల పెరుగుదల ఈ వేరియంట్ కారణమని భావిస్తున్నారు. బ్రిటన్‌లో ఈనెల 20న నిర్ధారణ అయిన 15,120 కేసుల్లో VUI21OCT-01 వేరియంట్‌ సోకడం వల్ల వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం కేసుల్లో ఇవి 6% ఉన్నాయని తెలిపారు. తొలిసారిగా ఈ రకం వేరియంట్‌ను జులైలో గుర్తించారు.

ఈ ఏడాది ఆరంభం నుంచి డెల్టా వేరియంట్‌పై నిశితంగా అధ్యయనం జరిగింది. ఈ వారం ప్రారంభంలో యూకే ఆరోగ్య అధికారులు AY.4.2 వ్యాప్తిని ప్రకటించే వరకు గత మూడు నెలల్లో భారత్ సహా అనేక ఖండాలలో AY.4 అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో మరి కొద్ది రోజుల్లో థర్డ్ వేవ్ రావడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆ 15 మంది ఎవరు?

Advertisement

తాజా వార్తలు

Advertisement