Sunday, October 17, 2021

‘మా’కు పోటీగా ‘ఆత్మ’!

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(‘మా’) ముక్కలు కానుందా? మా ఎన్నికల ముగిసినా అభిప్రాయ భేదాలు ఇంకా సద్దుమణగలేదా? అంటే ప్రస్తుతం అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌లో గెలిచిన సభ్యులూ ‘మా’ని వీడతారని ప్రచారం జరుగుతోంది. ‘మా’కు పోటీగా మరో అసోసియేషన్‌ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.  దాని పేరు ‘ఆత్మా’ అని సమాచారం. ‘మా’ ఎన్నికల తర్వాత తమ సభ్యత్వానికి ప్రకాశ్​ రాజ్​, నాగబాబు రాజీనామా చేశారు. ‘మా’ ​లో తలెత్తిన ప్రాంతీయభావం క్రమంలో ఇకపై తాము అసోసియేషన్​లో సభ్యులుగా కొనసాగలేమని తేల్చి చెప్పారు.

కాగా ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిచిన సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి శ్రీకాంత్ సహా పలువురు విజయం సాధించారు.

ఇది కూడా చదవండి: పిల్లలకు కొవాగ్జిన్ టీకా.. అత్యవసర వినియోగానికి అనుమతి?

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News