Tuesday, March 19, 2024

Orugallu: కాకతీయుల కోటకు కొత్తకళ.. 6.5 కోట్లతో అభివృద్ధి పనులు

ఖిలా వరంగల్ కాకతీయ రాజుల కోటకు కొత్త కళ రానుంది.. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నాడు మేయర్ గా మొదలు పెట్టిన పనికి నేడు ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డీ.జి (డైరెక్టర్ అఫ్ జనరల్) నుండి అనుమంతి లబించింది..ఖిలా వరంగల్ కోటను 6.5 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టనున్నారు..

చారిత్రాత్మక ఖిలా వరంగల్ లోని ఉత్తరద్వారం, దక్షిణ ద్వారం,కాకతీయుల 4 తోరణాలు,కుష్ మహల్, గుండు చెరువు గుట్ట,తదితర శిల్పాలు,కోటలను పర్యాటకుల ను కనువిందు చేయడం,శిల్పాల సౌందర్యాన్ని మరింత అద్భుతంగా చూపడం కోసం 6.5కోట్ల రూపాయల వ్యయం తో ఏర్పాటు చేయనున్న లైటింగ్ ఏర్పాటు కోసం రాతి కోట (ఉత్తరద్వారం) దగ్గర జరుగుతున్న పనులను శాసనసభ్యులు నన్నపునేని నరేందర్, కమిషనర్ ప్రావీణ్య, ఆర్కియాలజీ సూపరిండెంట్ స్మితా కుమార్ తదితరులు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారి ప్రత్యేక దృష్టితో చారిత్రక ఖిలా వరంగల్ ప్రాంతం ను అభివృద్ధి చేస్తూన్నామని, కాకతీయుల వారసత్వ సంపద ను ప్రపంచానికి తెలియజేయడం కోసం కేసీఆర్ గారు రామప్ప ను హెరిటేజ్ గా గుర్తించడం కోసం కృషి చేశారని, పక్కా ప్రణాళిక తో ప్రస్తుతం ఖిలా వరంగల్ లో శాశ్వత లైటింగ్ ఏర్పాట్లు 6.5 కోట్లతో ఏర్పాటు చేయబోతున్నామని,రాబోయే కాలం లో టూరిజం హబ్ గా మార్చడం కోసం ప్రణాళికలు రూపొందిస్తూన్నామని,మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు.

ఆర్కలాజికల్ సర్వే అఫ్ ఇండియా నుండి అనుమతులు రావడం సంతోషకరం..వీలైనంత వేగంగా పనులు పూర్తి చేసి కాకతీయుల రాజుల వైభవాన్ని,ఓరుగల్లు కళా వైభవానికి మిరిమిట్లు గొలిపే వెలుగులతో పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా ఆహ్లాదపరిచేలా పనులు చేపట్టాలని ఎమ్మెల్యే అదికారులకు సూచించారు.

ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement