Thursday, April 25, 2024

వైసీపీ ఎమ్మెల్యే రోజా కూతురికి ఐలవ్‌యూ చెప్పిన నెటిజన్

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ప్రస్తుతం ఆమె పలు టీవీ షోలకు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయినా ఫ్యామిలీ, పాలిటిక్స్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే రోజా కుమార్తె అన్షు నెటిజ‌న్స్‌కు చాలా సుప‌రిచితం. రోజా త‌న సోషల్ మీడియాలో అన్షు ఫొటోల‌ను రెగ్యుల‌ర్‌గా పోస్ట్ చేస్తుంటారు. మ‌రోవైపు అన్షు కూడా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

ఈ మధ్య కాలంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అన్షు.. తనకు వీలున‌ప్పుడ‌ల్లా నెటిజ‌న్‌లతో చిట్ చాట్ చేస్తుంటుంది. తాజాగా జరిగిన ఓ చిట్‌చాట్‌లో ఓ నెటిజ‌న్ ఆమెకి స్పానిష్ భాషలో ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేశాడు. దీనికి అన్షు ‘ఐ లవ్‌ యూ.. థాంక్యూ’ అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చింది. తనకు తెలుగులో నాగార్జున సినిమాలు చాలా ఇష్ట‌మ‌ని అన్షు పేర్కొంది. ‘మీరు హీరోయిన్ అవుతారా.. లేదా?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘ఈ ప్రశ్న నన్ను చాలా మంది అడిగారు. దానికి నా సమాధానం ఒక్కటే.. నాకు తెలియదు.. అసలు నేను ఆ ఆలోచన కూడా చేయలేదు’ అంటూ అన్షు స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement