Friday, May 20, 2022

Beast: ఓటీటీలో ‘బీస్ట్’ స్ట్రీమింగ్‌.. ఎప్పుడో తెలుసా ?

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన లేటెస్ట్ మూవీ ‘బీస్ట్‌’. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని నెల్స‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై క‌ళానిధి మార‌న్ నిర్మించారు. ఏప్రిల్ 13న భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. తాజాగా ఈ చిత్రం ఓటిటిలో విడుద‌ల‌ అయ్యేందుకు సిద్ధ‌మైంది. ‘స‌న్ ఎన్ఎక్స్‌టి’, ‘నెట్‌ఫ్లిక్స్‌’ల‌లో ఈ చిత్రం మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి 12 గంట‌ల నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement