Wednesday, April 24, 2024

జులై నుంచి ఆర్థిక వ్యవస్థకు మరింత ఊపు: నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్

జూన్‌ నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ప్రారంభమవుతుందని.. జులైలో అది మరింత ఊపందుకుంటుందని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. కరోనా రెండో దశ విజృంభణ ప్రభావం వల్లే దేశ వృద్ధి రేటు అంచనాలను ఆర్‌బీఐ 9.5 శాతానికి తగ్గించిందని తెలిపారు. తాజాగా కేసుల విజృంభణ ప్రభావం తొలి త్రైమాసికంపై ఉండనుందని వెల్లడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 10-10.5 శాతంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజీవ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణ కట్టడి బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంటుందని గుర్తుచేశారు. ఆ బాధ్యతను కేంద్రం సక్రమంగా నిర్వర్తిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement