Thursday, April 18, 2024

హైదరాబాద్ టు పాకిస్థాన్.. అక్రమంగా ట్రమడాల్ ఎగుమతి

తీవ్రమైన నొప్పి నివారణకు ఉపయోగించే ట్రామడాల్ డ్రగ్ ను ఎలాంటి అనుమతులు లేకుండా ఉత్పత్తి చేయడమే కాకుండా అక్రమంగా పాకిస్తాన్ కు విక్రయించి సొమ్ముచేసుకుంటున్న ల్యుసెంట్ డ్రగ్ కంపెనీపై ఎన్సీబీ దాడులు నిర్వహించి కంపెనీ డైరెక్టర్ తో పాటు నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారణ నిమిత్తం  బెంగుళూరులోని ఎన్ సీబీ కార్యాలయనికి తరలించారు.. ట్రామడాల్ వినియోగం అక్రమమని తెలుస్తుండగా ప్రత్యేక పర్యవేక్షణ లేకుండా వినియోగించారదని, కొన్ని సార్లు ప్రత్యేక పర్యవేక్షణలో ట్రామిడాల్ ను వినియోగిస్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు..కాగా సదరు ల్యుసెంట్ కంపెనీకి ట్రమడాల్ డ్రగ్ అనుమతి ఉందా లేదా అనుమతి ఉంటే అంత చిన్న కంపెనీ ఒకే సంవత్సరంలో అంటే 2021 లొనే 25 వేల కిలోల ట్రామిడాల్ ను ఎలా పాకిస్తాన్ కు ఉత్పత్తి చేసింది, అంత బారి స్థాయిలో ఉత్పత్తి సామర్థ్యం లేని ల్యుసెంట్ ఇతర కంపెనీలు సహకారం అందించాయ, పాకిస్తాన్ కు అక్రమంగా ఎలా ఎగుమతి చేశారనే కోణంలో ఎన్సిబి అధికారులు తమదైన శైలిలో విచారించేందుకే డైరెక్టర్ తో పాటు నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement