Thursday, April 18, 2024

పంజాబ్ సంక్షోభానికి తెర.. సిద్ధూకే పీసీసీ పగ్గాలు!

పంజాబ్ కాంగ్రెస్ లో ఏర్పడిన వివాదానిక తెర పడింది. పంజాయ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూకు పార్టీ హైకమాండ్ ఆమోద ముద్ర వేసింది. మరో నలుగురిని వర్కింగ్​ ప్రెసిడెంట్లుగా నియమించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది పంజాబ్ లో ఎన్నికలు జరగనున్న వేళ..  సీఎం అమరిందర్​ సింగ్, ఎమ్మెల్యే సిద్ధూ​ మధ్య విభేదాలు తారస్థాయికి చేరడం కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై దృష్టి పెట్టింది. పంజాబ్​ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ (పీపీసీసీ) అధ్యక్షుడిగా నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ నియామకానికి వ్యతిరేకంగా సీఎం కెప్టెన్​ అమరీందర్​ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. దీంతో రాష్ట్ర ఇంఛార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్​ రావత్​తో సమావేశం అనంతరం వెనక్కి తగ్గారు. అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తు ఎంతో తెలుసా?

Advertisement

తాజా వార్తలు

Advertisement