Thursday, April 25, 2024

Nature: ఎర్రని పూల బాట.. గుల్ మొహర్ పూలవాన

ప్రకృతి అనే కాన్వాస్ పై అందమైన పెయింటింగ్ వేసినట్లు విరబూసిన రంగురంగుల పూలు రమణీయంగా మనసుకు హత్తుకునేలా కనువిందు చేస్తున్నాయి. పిల్లగాలికి ఒక్కొక్కటి రాలుతున్న పూలు బాటసారులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి వేసవిలో చెట్లు ఆకులు సాధారణమే అయినా ఇందుకు భిన్నంగా గుల్ మోహర్ చెట్లు విచ్చుకున్న ఎర్రని పూలతో ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని ఏంపెడు గ్రామానికి చెందిన సర్పంచ్ కొలిపాక రాజయ్య ఇంటిముందు ఉన్న ఈ చెట్టు ప్రకృతికి వన్నె తెచ్చినట్లు ఉంది ఆ ఊర్లో ఈ చెట్టు స్వాగత తోరణం అల్లుకొని ఆహ్వానం పలుకుతుంది. ఆ ఊరికి వెళ్ళే ప్రతి ఒక్క బాటసారి వాహనదారులు చెట్లను చూసి ప్రకృతి ప్రేమికులు పరవశించు పోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement